ఏలా మొదలయిందో తెలియదు
నీ రూపం నన్నెందుకో వదలదు
కలే నిజమయిందో తెలియదు
నువు లేక నిముషమైనా గడవదు
నిను తొలి సారి చూసినపుడు,
కలిగిందో కలవరింత
నీ రూపం మనసున కొలువై
లాగింది నన్ను మరింత
గోల్కొండ లో గుసగుసలు
సంఘీ గుడి లో నీకై ఎదురు చూపులు
ట్యాంక్ బండు పై పాని పురీలు
మన ప్రేమకి తీపి గురుతులు

వానొచ్చిందని గొడుగేసుకొస్తె
వెక్కిరించి వానలొ తడిపావు
భార్గవీ నీ తలపుల జడి వానలొ
నేను గొడుగేసుకున్నా తడిసిపొయాను
వెన్నెల్లో వనిల్లా తింటావు
నా తోడు నీడై వుంటావు
మబ్బులో గువ్వ పిట్టలా ఎగిరేవు
చిన్నప్పుడు చందమామ రావే అన్నాను
ఇప్పుడు ఈ చందమామ నాదే అంటున్నాను
నిను పుట్టించిన ఆ శ్రీనివాసునుకి (దేవునికి)
కోటి పూవులతో పూజ చేసుకుంటాను
జన్మ జన్మలకి భార్గవీ మంత్రమే జపిస్తు వుంటాను
రచన; గోవర్ధన.
Picture sources:
Google images
నీ రూపం నన్నెందుకో వదలదు
కలే నిజమయిందో తెలియదు
నువు లేక నిముషమైనా గడవదు
నిను తొలి సారి చూసినపుడు,
కలిగిందో కలవరింత
నీ రూపం మనసున కొలువై లాగింది నన్ను మరింత
గోల్కొండ లో గుసగుసలు
సంఘీ గుడి లో నీకై ఎదురు చూపులు
ట్యాంక్ బండు పై పాని పురీలు
మన ప్రేమకి తీపి గురుతులు

వానొచ్చిందని గొడుగేసుకొస్తె
వెక్కిరించి వానలొ తడిపావు
భార్గవీ నీ తలపుల జడి వానలొ
నేను గొడుగేసుకున్నా తడిసిపొయాను
వెన్నెల్లో వనిల్లా తింటావు
నా తోడు నీడై వుంటావు
మబ్బులో గువ్వ పిట్టలా ఎగిరేవు
చిన్నప్పుడు చందమామ రావే అన్నాను
ఇప్పుడు ఈ చందమామ నాదే అంటున్నాను
నిను పుట్టించిన ఆ శ్రీనివాసునుకి (దేవునికి)
కోటి పూవులతో పూజ చేసుకుంటాను
జన్మ జన్మలకి భార్గవీ మంత్రమే జపిస్తు వుంటాను
అంకితం; శ్రీనివాస రెడ్డి , హైదరాబాద్ .
రచన; గోవర్ధన.
Picture sources:
Google images





- Follow Us on Twitter!
- "Join Us on Facebook!
- RSS
Contact