వీనుల విందగు ఆమని పాటవి
వెన్నెల రేయిన పూవుల తోటవి
వర్షాకాలపు మట్టి వాసనవి
తామరాకు పై నీటి భొట్టువి
వదువు కాలి అందెల సవ్వడివి
వరుని నుదుట కల్యాణ తిలకానివి
పాదాలను తాకె కెరటానివి
అదరాలను అలుముకున్న ఆరాటానివి
ఆరచేత ఎర్రగ పండిన గొరింటాకువి
ఆ సొగసరి వడ్డానం చాటు పుట్టు మచ్చవి
కవుల కమ్మని పదాల భావనవి
కలాకరుల వూహలకందని కల్పనవి
రచన
గోవర్ధన్
గోవర్ధన్
అంకితం
భావన, కల్పన అని పేర్లున్న అమ్మాయిలందరికీ .




- Follow Us on Twitter!
- "Join Us on Facebook!
- RSS
Contact