5, జనవరి 2012, గురువారం 8 కామెంట్‌లు

నీకు తెచ్చాను పువ్వు

నీకు వచ్చింది కోపం
అది నాకు తెచ్చింది తాపం

నీకు తెచ్చాను పువ్వు
నువ్వు నాకు ఇచ్చావు స్టవ్వు

నీకు చేశాను స్వీటు
నువ్వు వెంటనే విసిరావు ప్లేటు

నీకు తెచ్చాను స్వర్ణం
వెంటనే వచ్చింది నీ మొకంలో చలనం

రచన : సౌమ్య 
అంకితం : అలక పాన్పెక్కిన సత్యభామల కోసం
              ఆ అలకను  తీర్చడానికి మదన పడే బర్తల కోసం

3, డిసెంబర్ 2011, శనివారం 0 కామెంట్‌లు

ఎవరివో నీవు , ఎవరివో నీవు

ఎవరివో నీవు , ఎవరివో  నీవు 
నా ఊహలో నీవు , 
నా  ఊసులో నీవు  

ఎవరివో నీవు , ఎవరివో నీవు
ఎ  స్వప్నలోకానున్న చందమామవో 
ఎ తోట పూసిన మల్లె మొగ్గవో 

ఎవరివో నీవు ,ఎవరివో నీవు  
ఎ ఇంటి చిరు నవ్వువో 
ఎ గూటి చిలకమ్మవో 

ఎవరివో నీవు, ఎవరివో నీవు
ఎ పూలతో పోల్చాలో నిన్ను 
ఎ దేశంలో వెతకాలో నిన్ను 




రచన :  సౌమ్య 
అంకితం: స్వప్న సుందరి కోసం కళలు కనేవాళ్ళకి 
copyright 2011. pulakintha. all rights reserved. Blogger ఆధారితం.

share it

Share
 
;