19, నవంబర్ 2012, సోమవారం 3 కామెంట్‌లు

నువ్వు నా దగ్గర లెవెంటే


నువ్వు నా దగ్గర లెవెంటే
ఏలా నమ్మమంటావు , ఏలా నమ్మమంటావు,
నా చుట్టూ వునట్టుంటావు
నీ తలపుల వలలొ నను చుట్టు ముట్టావు

సబ్బు లేని స్నానం
పది మంది లొన పరద్యానం
అద్దంలొ నీ రూపం
నా చెవులకి నీ నాధం
ఎమనమంటావొ , ఎమనుకుంటావొ ఈ భావం

నేనలిసిపొయిన వేళ, నీ తలపు ఓ చిరుగాలి,
నే క్రుంగిపొయిన వేళ, నీ పిలుపు ఓ సెలయేరు
నా కళ్ళలొ వెలుగు, నా ముఖం పి మెరుపు
అడుగడుగునా నీ తలపు, అనువణువనా మైమరపు  

ఏలా నమ్మమంటావు , ఏలా నమ్మమంటావు,
నువ్వు నా దగ్గర లేవని,
నీ సౌందర్యం నను దోచుకోలేదని,  
నా జీవితం సౌమ్యామయం కాదని


రచన - డీ. గోవర్ధన్ 

అంకితం : సౌమ్య  





20, ఫిబ్రవరి 2012, సోమవారం 10 కామెంట్‌లు

ఎలా చెప్పను!

ఎలా చెప్పను!

నేను నాకే అర్ధమవ్వని ఈ క్షణాన, నా మధిలో ఆవేదన నీకు 
                               ఎలా చెప్పను!

ప్రేమను ప్రార్ధించు సమయాన ఆ తపస్సుని,నీవు భంగ పరచిన తీరు
                               ఎలా వర్ణించను!

"నీకెం, బగానె ఉంటావు!" అంటు నా తనువును, మనసడిగిన వైనం
                               ఎలా నివెధించను!

రాయి అని తెలిసినా,నామదికి పరాయి కాని నీ హృదయ స్పంధనను మరల         
                             ఎలా ప్రేరెపించను!



రచన: రవీంద్ర

అంకితం: లవర్స్  అందరికీ
copyright 2011. pulakintha. all rights reserved. Blogger ఆధారితం.

share it

Share
 
;