3, డిసెంబర్ 2011, శనివారం 0 కామెంట్‌లు

ఎవరివో నీవు , ఎవరివో నీవు

ఎవరివో నీవు , ఎవరివో  నీవు 
నా ఊహలో నీవు , 
నా  ఊసులో నీవు  

ఎవరివో నీవు , ఎవరివో నీవు
ఎ  స్వప్నలోకానున్న చందమామవో 
ఎ తోట పూసిన మల్లె మొగ్గవో 

ఎవరివో నీవు ,ఎవరివో నీవు  
ఎ ఇంటి చిరు నవ్వువో 
ఎ గూటి చిలకమ్మవో 

ఎవరివో నీవు, ఎవరివో నీవు
ఎ పూలతో పోల్చాలో నిన్ను 
ఎ దేశంలో వెతకాలో నిన్ను 




రచన :  సౌమ్య 
అంకితం: స్వప్న సుందరి కోసం కళలు కనేవాళ్ళకి 
2, డిసెంబర్ 2011, శుక్రవారం 0 కామెంట్‌లు

ఎందుకలా చూస్తావు చెలియా

courtesy
ఎందుకలా చూస్తావు చెలియా 
తప్పుతుంది నా గుండె లయా 

నీ కను రెప్పలు కిట కిట మంటే 
నా మనసుకి కిత కితలాయే 

నీ చిరునవ్వుకి చంద్రుడు కూడా 
దాకోడా చిన్న బోయీ

నీ కనుల లో వెలిగే వెన్నల
పోటి రాదా  ఆ జాబిలికైనా 

నువ్వు చూసే ఎదురు చూపుకి 
కారణం నేనైతే   బాగున్ను

నీ కాటుక, బొట్టు , సింగారానికి 
అద్దం   నేనైతే బాగున్ను

నా మనసున కురిసిన తుఫాను 
నీ ఒడ్డుకి ( వడికి) చేరిస్తే బాగున్ను   


రచన :  గోవర్ధన్ 
అంకితం :  ప్రియురాలి ప్రేమకి తపించే ప్రేమికులందరికీ

13, అక్టోబర్ 2011, గురువారం 0 కామెంట్‌లు

కవుల కమ్మని పదాల భావనవి


వీనుల విందగు ఆమని పాటవి
            వెన్నెల రేయిన పూవుల తోటవి
వర్షాకాలపు మట్టి వాసనవి
            తామరాకు పై నీటి భొట్టువి
వదువు కాలి అందెల సవ్వడివి
            వరుని నుదుట కల్యాణ తిలకానివి
పాదాలను తాకె కెరటానివి
            అదరాలను అలుముకున్న ఆరాటానివి
ఆరచేత ఎర్రగ పండిన గొరింటాకువి
            ఆ సొగసరి  వడ్డానం చాటు పుట్టు మచ్చవి
కవుల కమ్మని పదాల భావనవి 
           కలాకరుల వూహలకందని కల్పనవి 

రచన
గోవర్ధన్ 

అంకితం
భావన, కల్పన అని పేర్లున్న అమ్మాయిలందరికీ .
19, ఆగస్టు 2011, శుక్రవారం 1 కామెంట్‌లు

ఏలా మొదలయిందో తెలియదు

ఏలా మొదలయిందో  తెలియదు 
నీ రూపం నన్నెందుకో వదలదు
కలే నిజమయిందో  తెలియదు
నువు లేక నిముషమైనా గడవదు

నిను తొలి సారి చూసినపుడు,
కలిగిందో కలవరింత
నీ రూపం మనసున కొలువై
లాగింది నన్ను మరింత

గోల్కొండ లో గుసగుసలు
సంఘీ గుడి లో  నీకై ఎదురు చూపులు
ట్యాంక్ బండు పై పాని పురీలు
మన ప్రేమకి తీపి గురుతులు


వానొచ్చిందని గొడుగేసుకొస్తె 
వెక్కిరించి వానలొ తడిపావు 
భార్గవీ నీ తలపుల జడి వానలొ
నేను   గొడుగేసుకున్నా  తడిసిపొయాను

వెన్నెల్లో వనిల్లా తింటావు 
నా తోడు నీడై వుంటావు
మబ్బులో గువ్వ పిట్టలా  ఎగిరేవు
నా  గుండె గూటికి చేరుకున్నావు

చిన్నప్పుడు చందమామ రావే  అన్నాను
ఇప్పుడు ఈ చందమామ నాదే అంటున్నాను
నిను పుట్టించిన ఆ శ్రీనివాసునుకి (దేవునికి)
కోటి పూవులతో పూజ చేసుకుంటాను

జన్మ జన్మలకి భార్గవీ మంత్రమే జపిస్తు వుంటాను


అంకితం;  శ్రీనివాస రెడ్డి , హైదరాబాద్ .



రచన; గోవర్ధన.

Picture sources:
Google images


30, జులై 2011, శనివారం 2 కామెంట్‌లు

కలల రాకుమారి

" నీ నవ్వుకి, పువ్వులు చిన్నభోయె
  నీ పాటకి, కోయిల ఆగి పోయే "

"" నీ కనుల  లో, ఆ  వెన్నెల వెలుగు
    నీ కురుల లోన  , వన్నెలు కొలువు "

" నీ కన్నులూ , , ఆ వెన్నెలా చుట్టలేమో
నిను చూస్తె  , నా మనసుకి హాయిగా వుంది        "

""మొదటి సారి,  నిను చూసి నపుడు
 గుండె జారి,  నను విడిచి  పోయెనే " 

"" నీ నవ్వు   లో,  ,, నే మాయమయ్యాను 
నీ ఊహ లో,,,, నే లీనమయ్యాను ""

"'ఎవరి వో నువ్వు సౌమ్యంగా వుంటూనే
కోటి అలల అలజడి రేపావు ,
నా మనసుని వూయలలూపావు ""




గోవర్ధన్




27, జులై 2011, బుధవారం 2 కామెంట్‌లు

నిమ్మ పండు నిగ నిగంటి చిన్న దాన

నిమ్మ పండు నిగ నిగంటి చిన్న దాన 
నిన్ను చూడ చాలవమ్మ వేయి  కన్నులైన 
నీ మెడన చిన్నదే,  కోహినూరు వజ్రమైన  

అతిశయోక్తి కాదే
చీర నీ అందం చూసి, సిగ్గుతో  ముడుచుకున్నా 

 అడవి తేనే  వూరునేమో, నీ ఆదరాల లోన

గులాబీలు,, నీ చేతి వెళ్ళు ఐతే !!
నువ్వు తాకితే  చాలు నన్ను ,, ముళ్ళు గుచ్చు కున్న 

అర విరిసిన నీ కురులకి నా ఫుస్పాంజలి ,,
నువ్వు ఓర కంట చూడకమ్మ ,
వేస్తుంది నా మనసుకి చలి ..

గోవర్ధన్

picture courtesy:
www.enchantingkerala.org







1 కామెంట్‌లు

నా మనసుని స్పందింప చేసింది నువ్వే

నా మనసుని  స్పందింప చేసింది  నువ్వే
నా హృదయాన్న ఉదయించిన ప్రేమదేవతవు నువ్వే!!
నా మనసుకి కనిపించిన నువ్వు 
నా కనులకి  కనిపించగ రావా !!
నా మనసున  ప్రేమ పుట్టించిన  నువ్వు
నీ ప్రేమందించగా రావా !!


గోవర్ధన్

 

 



copyright 2011. pulakintha. all rights reserved. Blogger ఆధారితం.

share it

Share
 
;